UPDATED 21st OCTOBER 2020 WEDNESDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): జట్టు వర్కర్లకు సంవత్సరకాలంగా కొత్త అగ్రిమెంట్ చేయలేదని, వెంటనే వేతన ఒప్పందం అమలు చేయకపోతే వ్యాపార కార్యకలాపాలు అడ్డుకుంటామని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, పిఎస్ నారాయణ హెచ్చరించారు. స్థానిక జట్టు వర్కర్ల యూనియన్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ అధ్యక్షత మేస్త్రీల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మధు మాట్లాడుతూ కరోనా సాకుతో పెద్దాపురం పట్టణంలో వ్యాపారవర్గాలు అగ్రిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తూ నష్టాలు వచ్చాయని కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. లేబర్ ఆఫీసర్ యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్దాపురం పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సత్యనారాయణ, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు రామదాసు, త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.







