ఆదిత్య ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డికి డాక్టరేట్

UPDATED 27th OCTOBER 2017 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్  విభాగానికి  చెందిన ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డికి కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి శుక్రవారం తెలియచేశారు. కాకినాడ  జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కె. మల్లికార్జునరావు, డాక్టర్ ఎ.బి. శ్రీనివాసరావుల నిర్దేశకత్వంలో మెకానికల్ విభాగంలో సమర్పించిన "A  NOVAL  APPROACH TOWARDS ENUMERATION, DETECTION OF ISOMORPHISM AND RATING OF PLANAR KINEMATIC CHAINS " థీసిస్ కు ఈ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ ఎన్. కృష్ణ దీపక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, డాక్టర్ దివాకర్, డాక్టర్ ఎన్. విశాలాక్షి, డాక్టర్ శరభోజి, డాక్టర్ ఇ. మోహన్, ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ శాఖాధిపతులు, క్యాంపస్ ఇంచార్జి ఎం. భాస్కరచంద్రారెడ్డి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు ఆయనను అభినందించారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us