UPDATED 22nd SEPTEMBER 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సామర్లకోటలోని కరాటే క్రీడాకారులకు రానున్న రోజుల్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. ఈనెల 15వ తేదీన హైదరాబాదులో జరిగిన నాల్గవ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించిన కరాటే క్రీడాకారులను స్థానిక మెప్మా కార్యాలయంలో ఆదివారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దవులూరి దొరబాబు మాట్లాడుతూ కరాటే క్రీడ నేటితరం యువతకు ఎంతో అవసరమని, ముఖ్యముగా బాలికల ఆత్మరక్షణకు ఇది ఎంతో తోడ్పాటుగా ఉంటుందని అన్నారు. ఈ క్రీడలో తర్ఫీదు ఇస్తున్న కోచ్ శంకర్ సేవలను ఆయన అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో నాలుగు బంగారు పతకాలు, నాలుగు వెండి పతకాలు, నాలుగు రజత పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు కన్సోలేషన్ పతకాలు సాధించిన మరో ఇద్దరు విద్యార్థులను దొరబాబు అభినందిస్తూ వారికి పథకాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, వైఎస్ఆర్ సిపి నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్, కాళ్ల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, సల్లూరి కల్యాణ్, నేతల హరిబాబు పిట్టా సత్యన్నారాయణ, తలారి దొరబాబు, చిట్టిమాని శ్రీనివాసు, ఎం.డి ఉబేదుల్లా, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), జోన్ చైర్మన్ మద్దిరాల శివనాగకృష్ణ, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మేకా శ్రీనివాస్, ప్రత్తి రామలక్ష్మణమూర్తి, డీఎస్ఏ క్లబ్ నాయకులు కమలరాజు, ఆకుల పెదబాబు, లైన్స్ క్లబ్ నాయకులు వి. రవికుమార్, తదితరులు పాల్గొన్నారు...







