UPDATED 28th JUNE 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఇసిఇ విభాగం గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ జె.ఎన్.టి.యు ఇసిఇ ప్రొఫెసర్ డాక్టర్ బి. లీలాకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఈ సదస్సు తమ కళాశాల విద్యార్ధులకు ఆధునిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిధి డాక్టర్ లీలా కుమారి తమ విజ్ఞానాన్ని విద్యార్థులతో కలిసి పంచుకున్నారు. అనంతరం కళాశాల ఇసిఇ విభాగాధిపతి డాక్టర్ కె. శివకుమార్ స్వామి ముఖ్య అతిధికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎమ్.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







