కౌలు రైతులకు ఊతమివ్వాలి: జేడీ ప్రసాద్‌

సామర్లకోట:15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): సొంత భూమి గల రైతులందరూ కౌలు రైతులకు కార్డులు అందించేందుకు ఊతమివ్వాలని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్‌ కోరారు. వేట్లపాలెం రైతు భరోసా కేంద్రాల్లో పంటల సాగు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని సోమవారం మాట్లాడారు. పంట సాగు హక్కు పత్రం ద్వారా ప్రభుత్వం అందించే వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, పంట రాయితీ, పంటలకు ప్రభుత్వ మద్దతు ధర అందించే అవకాశాలు ఉంటాయన్నారు. పంట సాగు పత్రం ద్వారా 11 నెలల కాలపరిమితి వరకే కౌలు రైతులకు పంటలపై హక్కు కల్పించామని, భూమి మీద ఏ విధమైన హక్కులు ఉండవని స్పష్టం చేశారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర సదుపాయాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీకే జిల్లా కోఆర్డినేటర్ మాధవరావు, ఏడీఏ పద్మశ్రీ, నోదల ఆఫీసర్ వజ్రపు జితేంద్ర, ఏవో ఐ. సత్య రైతులు పాగొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us