జీజీహెచ్‌కు స్కానింగ్‌ యంత్రం అందజేత

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని పిడియాట్రిక్‌ విభాగానికి కోరమాండల్‌ సంస్థ స్కానింగ్‌ యంత్రాన్ని బుధవారం వితరణగా అందజేసింది. రూ.8.5 లక్షల విలువగల ఈ యంత్ర పరికరం సాయంతో చిన్న పిల్లలకు వారికి వైద్యం అందించే పడక వద్దే స్కానింగ్‌ తీసేందుకు వీలు పడుతుంది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ వెంకటబుద్ధ, పిడియాట్రిక్‌ విభాగాధిపతి ఎం.ఎస్‌.రాజు, వైద్య నిపుణుడు వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో సుధీర్‌, కోరమాండల్‌ సంస్థ ప్రతినిధులు శంకర్‌, ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us