ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు మీరే

UPDATED 2nd AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: వాలంటీర్లు సేవాభావం, నీతి నిజాయితీలతో నిస్వార్థంగా సేవలందించాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. సామర్లకోట పట్టణంలో నూతనంగా ఎంపికైన వార్డు వాలంటీర్లకు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలందించేందుకు వాలంటీర్లుగా ఇది మీకు దక్కిన అదృష్టంగా భావించాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతీ వాలంటీర్ ఒక సైనికుడిలా పని చేయాలని అన్నారు. వాలంటీర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వాలంటీర్లుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ రామారావు, మేనేజర్ అచ్యుతరాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us