నన్ను గెలిపించండి...నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తా

* జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర
* ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగని ప్రచారం

UPDATED 30th MARCH 2019 SATURDAY 9:00 PM

పెద్దాపురం: వచ్చే ఎన్నికల్లో గాజులు గుర్తుపై ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపండి.. జీవితాంతం నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం పట్టణంలో పలు వార్డుల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి అలుపెరగకుండా వార్డుల్లో పర్యటిస్తూ అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాత పెద్దాపురం ఒకటవ వార్డుకు చెందిన సుమారు 50 మంది జై భారత్ నేషనల్ పార్టీలో చేరారు. వారికి డాక్టర్ చిన్నయ్యదొర కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ నన్ను గెలిపించండి, నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉంటూ అర్ధరాత్రి అయినా అందరికీ అందుబాటులో ఉంటూ యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తానని మీ అందరివాడిగా, మీలో ఒకడిగా ఉంటానని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. అబ్బాస్, సత్యశ్రీ, శివ, రాజారావు, వడ్లపాటి వీరబ్బాయి, ఎన్. భీమరాజు, ప్రసాద్, బత్తుల ఏసుబాబు, కె. శ్రీను, ఇంజుమళ్ల సత్తిబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us