మృతిచెందిన ఆశావర్కర్ల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి

సీఐటీయు డిమాండ్.

గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: మృతిచెందిన అశవర్కర్ల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని సిఐటీయు జిల్లా నాయకులు పి. రామరాజు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గంగవరం పీహెచ్సీ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన రిలే దీక్షలు గురువారం 17వ రోజుకు చేరాయి. ఆశాల దీక్షలకు సీఐటీయూ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా రామరాజు మాట్లాడుతూ ఇటీవల మృతిచెందిన 5గురు అశవర్కర్ల కుటుంబాలను ప్రభుత్వం, ఐటీడీఏ ఆదుకునే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు నెలల కాలంలో ఇప్పటి వరకు 5గురు ఆశవర్కర్లు వివిధ కారణాల వల్ల చనిపోవటం జరిగిందని, చనిపోయిన ఆశవర్కర్ల పట్ల ఇప్పటివరకు తగు విచారణ కూడా వైద్య ఆరోగ్యశాఖ గాని, ఐటీడీఏ గాని పట్టించుకున్న పరిస్థితి లేదని, ఆందోళన చేస్తే హామీలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని ఇప్పటివరకు చనిపోయిన వర్కర్ల కుటుంబాలకు ఏమి న్యాయం చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణ గిరిజన ప్రజలకు ఎన్నో కష్టాలు అధికమించి వైద్య సేవలు అందిస్తున్న ఏజెన్సీ గిరిజన అశవర్కర్ల మరణాల పట్ల ఉన్నతాదికారులకు ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం చూపుతున్నారని నాయకులు ప్రశ్నించారు. ఆశవర్కర్ల ప్రాణాలు అధికారులకు పట్టవా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో కూడా ఎనలేని సేవలందించి వారి ప్రాణాలతో పాటు గిరిజన ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందుండి కరోనా వారియర్స్ గా సేవలందించిన గిరిజన ఆశవర్కర్ల మరణాలు పట్ల అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యధోరణిన సరి కాదన్నారు. తక్షణం అధికారులు స్పందించాలని, చనిపోయిన ఆశవర్కర్ల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. చనిపోయిన అశవర్కర్ల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని, ఏజెన్సీలోని ఏ పీహెచ్సీ లో ఆశవర్కర్ల పై వేధింపులు చేస్తే సహించేది లేదని, యూనియన్ గా తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని యూనియన్ నాయకులు హెచ్చరిక చేశారు. ఈకార్యక్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us