పెదబ్రహ్మదేవంలో ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ

UPDATED 22nd MARCH 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగినట్లు సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. గత నెల 4  వ తేదీన కాకినాడ కిరణ్ ఆసుపత్రిచే నిర్వహించబడిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న 54 మందికి సమితి గౌరవ అధ్యక్షుడు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మచే కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఇళ్లపల్లి, మర్రిపూడి గ్రామాలకు చెందిన ఐదుగురు సభ్యులకు వారి ఇంటికి సమితి సభ్యులు వెళ్లి అందించనున్నట్లు సమితి కార్యదర్శి వి.విశ్వనాధ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నువ్వుల వెంకట్రాజు, పి. మల్లికార్జునరావు, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us