UPDATED 4th MAY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: పట్టణ పరిధిలో రెండవ వార్డుకు చెందిన నూతన దంపతులు బర్రే సంతోష్, సత్యలకు శుక్రవారం చంద్రన్న పెళ్లికానుకను వార్డు కౌన్సిలర్ జుత్తుక సుబ్బలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవర్గాలకు చంద్రన్న పెళ్లికానుక ప్రోత్సాహకం ఆర్ధిక భరోసాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, జుత్తుక అప్పారావు, మెప్మా, కల్యాణమిత్ర సిబ్బంది గంగాభవాని, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.







