చెట్లతోనే సకల జీవుల మనుగడ

* మొక్కలు నాటి సంరక్షించాలి 
* ఆదిత్యలో ప్రతిష్ఠాత్మకంగా వనం-మనం
UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: సకల జీవుల మనుగడకు చెట్ల పెంపకం ఎంతో అవసరమని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వనం-మనం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుగుణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఐదు మొక్కలు నాటితే పచ్చదనం వెల్లివిరుస్తుందని, మొక్కను నాటి ఇష్టమైన పేరు పెట్టుకుంటే సంరక్షణ బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. శుభ కార్యక్రమాలు, పుట్టిన రోజున మొక్కలు నాటాలని, చెట్లతోనే కాలుష్య రహిత సమాజం సాధ్యమన్నారు. విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ప్రజాహిత, సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమంలో అయినా తమ సంస్థ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజహిత కార్యక్రమాలలో పాల్గోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం. గోవర్ధనరెడ్డి, అధ్యాపక సిబ్బంది ఎస్..శ్రీధర్, ఎస్.కె. సౌజన్య, బి. సౌజన్య, పి. పోసిబాబు, క్యాంపస్ ఉద్యానవన పర్యవేక్షకుడు పి. బ్రహ్మానందరావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us