Punjab Polls: పంజాబ్ లోక్ కాంగ్రెస్.. ఏడుగురు అభ్య‌ర్థుల తొలి జాబితా..

Updated 29 January 2022 Saturday 08:00 PM

పంజాబ్ (రెడ్ బీ న్యూస్): ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలతో రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నేృతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతోంది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ జనవరి 29న (శనివారం) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులను పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఖరారు చేసింది.

మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ కూటమిలో బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 37 స్థానల్లో బరిలోకి దిగుతోంది. అలాగే శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) మొత్తంగా 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడుతోంది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఒప్పందం చేసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us