UPDATED 21st JULY 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సురంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొక్కలు మానవాళికి నేస్తాలని, వాటిని సంరక్షించడం వల్ల వాతావరణ సమతుల్యత కలిగి సకాలంలో వర్షాలు పడి పంటలు పండడానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. మొక్కలు నాటి అవి సక్రమంగా పెరిగేలా శ్రద్ధ చూపాలని, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతీ మొక్క పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వివిధ రకాల పండ్లజాతి మొక్కలు, నీడనిచ్చే సుమారు 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు పి. శివకుమార్, ఆర్. జ్ఞానవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.







