మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు

UPDATED 11th MARCH 2020 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణ పరిధిలోని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ స్థానాలకు తొలి రోజైన బుధవారం రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఏఆర్ఓ ఎం. ఏసుబాబు తెలిపారు. 30వ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లపల్లి వెంకట సత్యనారాయణ, సిపిఎం నుంచి కరణం గోవింద రాజు తమ నామినేషన్లు దాఖలు చేశారన్నారు. అలాగే సామర్లకోట జెడ్పీటీసీ స్థానానికి వైసిపి నుంచి ఎలిశెట్టి అమృత, టిడిపి నుంచి తోటకూర శ్రీదేవి తమ నామినేషన్లను కాకినాడ జిల్లా పరిషత్ లో దాఖలు చేశారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి చివరిరోజైన బుధవారం వివిధ పార్టీలకు సంబంధించి 118 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి రామరాజు చెప్పారు. ఎంపీటీసీ స్థానాలకు ఒక్క రోజులోనే  ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో మండల పరిషత్ కార్యాలయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us