UPDATED 20th DECEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జిల్లా కాంట్రాక్టు ఉద్యోగుల కమిటీ వైస్ చైర్మన్ వి. వీరనాగు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న నాటి నుంచి విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ శాఖలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి ప్రభుత్వం నేరుగా వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ తరహాలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి నేరుగా వేతనాలు ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈనెల 21న విజయవాడ జింఖానా మైదానంలో జరగనున్న కరెంటోళ్ల శంఖారావం కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు.







