UPDATED 13th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: మండల పరిధిలోని పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన రామకృష్ణ సేవా సమితి, లయన్స్ క్లబ్ సంయుక్తంగా స్థానిక లయన్స్ క్లబ్ లో మంగళవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల (పెదబ్రహ్మదేవం) సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. అనంతరం సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించడమే లక్ష్యంగా సమితి కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్. ఎం. నీరజ మాట్లాడుతూ దేశీయ వైద్యానికి ఇంత ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.అమ్మాణి, ఎఫ్.ఎన్.వో. నాగేశ్వరరావు, ఎస్.ఈ.ఎస్ .కె. సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







