UPDATED 9th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ (బోస్టన్) నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొని ఐడియా టు ఎంటర్ ప్రెన్యూర్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచారని ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ వర్క్ షాప్ లో దేశవ్యాప్తంగా 460 టీములు పాల్గొన్నాయని, అందులో తమ కళాశాలకు చెందిన ఆర్. గాయత్రీదేవి, కె. బాలశివతరుణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శనతో ప్రథమస్థానంలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎ.పి.ఎస్.డి.సి పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది, తదితరులు అభినందించారు.







