ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

UPDATED 15th NOVEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్లే రహదారిలో తూము వద్ద పొలంలోకి వెళ్తున్న ట్రాక్టర్ గురువారం బోల్తాపడి వ్యక్తి మృతి చెందాడు. స్థానిక గణపతినగరానికి చెందిన ఎ. జోగారావు ట్రాక్టర్ నడుపుకుంటూ పొలానికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడడంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us