ఈ-బైక్ రూపొందించిన గైట్ విద్యార్థులు

UPDATED 27th MARCH 2018 TUESDAY 7:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల విద్యార్థులు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ రూపొందించారు. కళాశాలలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మెరుగు వెంకటేష్, ఎస్. సాయి మాధవీలత, ఫణికుమార్, గిరీష్ గైడ్లు ఎం. మణికంఠ దొర, ఆటోమొబైల్ విభాగాధిపతి వి. సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో దీనిని రూపొందించారు. దీనికోసం ఒక పాత బైక్ సమీకరించి, దానిలోని సైలెన్సర్, ఇంజిన్ తొలగించి ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీలు అమర్చారు. ఇంజిన్ ఉండే ప్రదేశంలో నాలుగు బ్యాటరీలు అమర్చి, ఎలక్ట్రిక్ మోటార్ వెనుక చక్రంలోనే ఉండేవిధంగా, గేర్లు లేకుండా దీనిని తయారుచేశారు. ఈ బైక్ చోదకుడు హెల్మెట్ ధరించకపోయినా, మద్యం సేవించి ఉన్నా స్టార్ట్ కాదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి మాట్లాడుతూ భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే అని, అత్యంత సురక్షిత విద్యుత్ వాహనాల రూపకల్పనలో తమ కళాశాల విద్యార్థులు నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల వైస్ చైర్మన్ శశికిరణ్ వర్మ, తదితరులు అభినందించారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us