యువ ఇంజనీర్ల ప్రజ్ఞాపాఠవాలకు వేదికగా వేద-2018

UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 6:00 PM 

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ వేద-2018 శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యింది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు సోషల్ మీడియాలో ఎంతో కొత్తదనంతో కవితా ధోరణితో రాస్తున్నసందేశాలు ఎంతో ముచ్చట గొల్పుతూ ఉంటాయని, అదే సృజనాత్మకత, నూతన దృక్పధం, ఆలోచనలు చదువుపై ఉంచితే అద్భుతాలు చేయవచ్చని అన్నారు. ముఖ్య అతిధులుగా హాజరైన కాకినాడ ఓ.ఎన్.జి.సికి చెందిన జిఎమ్ (సివిల్) జి.కె. గుప్తా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాకినాడ హెడ్ టి.కె. రామయ్య, శ్రీ లలితా ఇండస్ట్రీస్ జిఎం షేక్ ఎం.డి. గౌస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుచున్న విషయాలపై సంపూర్ణమైన అవగాహన, పరిజ్ఞానం సాధించడంతో పాటు మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై తప్పనిసరిగా పట్టు సాధించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో వేగంగా జరుగుతున్న నూతన విద్యావిధానంలో మార్పులు ఎప్పటికప్పుడు తెలుసుకొని అభివృద్ధి వైపు పరుగులు తీయాలని లేనిచో వెనుకబడిపోతామని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు ఈ వేద-2018 చక్కటి వేదిక కావాలని విజ్ఞానవంతంగా మంచి ఫలితాలు ఇవ్వాలని అభిలషించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులను ముఖ్య అతిధులు సందర్శించారు. లాంగ్వేజ్ క్లబ్, ప్రస్తుత ప్రపంచీకరణలో వివిధ భాషాప్రవీణ్యం యొక్క ఆవశ్యకతను చక్కటి పరిష్కార వేదికగా నిలిచింది. స్త్రీల స్వీయ రక్షణ గురించి తర్ఫీదు అవగాహనలు మిక్కిలి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్. వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us