విజయదుర్గా పీఠంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు

UPDATED 21st SEPTEMBER 2017 THURSDAY 9:00 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో 45 వ దసరా శరన్నవరాత్రి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హేవలంబి నామసంవత్సర దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొలిరోజున రజితకవచాలాంకృత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ వేద పండితుడు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో గాడ్ మనుమరాలు సీతారమ్య , వెంకటసుబ్రమణ్యం దంపతులు గణపతి పూజ, నవగ్రహ పూజలు అనంతరం ఉదయం 8.05 నిమిషాలకు అమ్మవారి మూలవిరాట్ వద్ద కలశస్థాపన చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో 872 కలశాలు స్థాపించి సామూహిక కుంకుమ పూజలు చేశారు. అమ్మవారి సన్నిధిలో పదిరోజులు పాటు ఈ కలశాలను ఉంచి విజయదశమి రోజున కలశ ఉద్వాసన అనంతరం నెలకొల్పిన కలశాలను భక్తులు తిరిగి తీసుకునివెళ్తారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. శరన్నవరాత్రుల యొక్క విశిష్టత, దీక్షా ధారణ చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను భక్తులకు వివరించారు. అలాగే సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపి రాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్( బాబి), ద్రోణంరాజు లక్ష్మీ నారాయణ , హిందూ ధర్మ పరిరక్షణ సమితి అసోసియేట్ రీజినల్ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.            
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us