గ్రామదర్శినితో సమస్యలు పరిష్కారం

UPDATED 17th AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీడీవో సిహెచ్ జగ్గారావు అన్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజెేయాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, గృహనిర్మాణ శాఖ ఎఇ చౌదరి, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us