అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

* జై భారత్ నేషనల్ పార్టీతోనే పేదలకు న్యాయం
* పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర 

UPDATED 3rd APRIL 2019 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం/సామర్లకోట: ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి  డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సామర్లకోట, పెద్దాపురం మండల పరిధిలో గల పలు గ్రామాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ గుర్తు గాజులుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు తమవైపే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నీతివంతమైన, సుస్థిర పాలన అందించే శక్తి తమ పార్టీకి మాత్రమే సాధ్యమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఒక్క అవకాశం కల్పించి గాజులు గుర్తుపై ఓటు వేస్తే శాసనసభలో తన గళాన్ని వినిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.   

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us