ఆదిత్యలో ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వందేమాతర గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువకులు, విద్యార్థుల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. దేశం సాంకేతికంగా ఎదగాలని, అందుకు తగినట్లు విద్యార్థులు తమ జీవితాలను మలుచుకోవాలని సూచించారు. కుల, మత, వర్గ భేదాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. దేశ స్వాతంత్య్రం సాధించిన యోధులను, జాతీయోద్యమంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ, వారు చూపిన బాటలో పయనించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్షర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, ఇ. మోహన్, డాక్టర్ శరభోజి, జి. రామకృష్ణారావులు, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us