ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పధకం విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం భారత ప్రభుత్వంచే 1969 సంవత్సరం ప్రారంభించబడిన యువజన కార్యక్రమమని, విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసమని కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసింది యువకులే అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణమని, అలాగే మనం పదిమందిలో ఉన్నప్పుడు మనవల్ల ఆ పదిమందికీ ప్రయోజనం ఉండాలని, ఆవిధంగా పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవ అని అన్నారు. విద్యార్థులు కూడా సంఘజీవులే అని, సంఘంలో భాగస్వాములే కాబట్టి విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే భాద్యత విద్యార్థులపై ఉందని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను సామాజిక అభివృద్ధి కోసం ఉపయోగించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. రాజశేఖర్ ఫణీంద్ర, అసిస్టెంట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. సుధీర్, ఎన్ఎస్ఎస్ ఫాకల్టీ ఇంచార్జులు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us