UPDATED 12th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రిక్షా కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు బాలం శ్రీనివాస్, కార్యదర్శి తుంపాల శ్రీనివాస్ అన్నారు. రిక్షా కార్మికుల సంఘం ఎనిమిదవ మహాసభ దూలపల్లి రాజు అధ్యక్షతన స్థానిక భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు బాలం శ్రీనివాస్, కార్యదర్శి తుంపాల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. రిక్షా కార్మికులకు ఉచితంగా గృహాలు నిర్మిచాలని, రిక్షాలు కొనుగోలుకు రుణాలు మంజూరు చేయాలనీ అన్నారు. రోజువారీ కష్టంపై ఆధారపడి జీవిస్తున్న రిక్షా కార్మికులకు సరైన బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వీరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. రిక్షా కార్మికులకు సంఘం తరఫున ఆర్ధిక సహాయ సహకారం అందచేయడం జరుగుతోందని అన్నారు. అనంతరం సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.







