కూలింగ్ వాటర్ టిన్స్ బహూకరణ

UPDATED 16th MARCH 2018 FRIDAY 7:00 PM

సామర్లకోట: పదవతరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్ధం మండలంలో వెంకట కృష్ణరాయపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్మార్ట్ సామర్లకోట టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం కూలింగ్ వాటర్ టిన్స్ అందచేశారు. ఈ వాటర్ టిన్స్ కుసుమంచి రత్నంజీ అందించినట్లు, రవాణా చార్జీలను టీమ్ సభ్యులు భరిస్తారని, పరీక్షలు జరిగే కాలంలో వాటర్ పంపిణీ జరుగుతుందని స్మార్ట్ సామర్లకోట టీమ్ సభ్యులు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ సామర్లకోట టీం సేవలు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నామని వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మడగల శ్యామ్, యేసురాజు, దత్తా చౌదరి, రాజు, దినేష్, సరస్వతిరావు, తదితరులు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us