UPDATED 6th APRIL 2019 SATURDAY 9:00 PM
సామర్లకోట: వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న శ్రీ వినాయక ఆటో యూనియన్ కార్యవర్గం, సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ చిన్నయ్య, తాతపూడి కృష్ణబాబు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, రైల్వే స్టేషన్ మేనేజర్, ఆర్పీఎఫ్ ఎస్సై, ఆటో యూనియన్ సభ్యులు, ప్రెసిడెంట్ రమణ, వైస్ ప్రెసిడెంట్ చక్రం, తదితరులు పాల్గొన్నారు.







