ప్రాణాల కంటే విధి నిర్వహణే గొప్పది

* శాంతి భద్రతల పరిరక్షణకు కృషి 
* డిఎస్పీ చిలకా వెంకట రామారావు
* ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

UPDTED 21st OCTOBER 2018 SUNDAY 7:00 PM

సామర్లకోట: పోలీసులకు ప్రాణాల కంటే విధి నిర్వహణ, శాంతి భద్రతలే ముఖ్యం, వీటి పరిరక్షణకు ఏ త్యాగాలైనా చేస్తారని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు, ప్రజా ప్రతినిధులు స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి స్టేషన్ సెంటర్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ చిలకా వెంకట రామారావు మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలు, ప్రజల మాన, ప్రాణ, ఆస్తులను కాపాడటంలో పోలీసులు ముందంజలో ఉన్నారని, దేశ సరిహద్దుల్లోనే కాక సమాజంలోని అంతర్గత, బాహ్య శక్తులను తరిమికొట్టడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  పాలకుర్తి శ్రీనుబాబు, బడుగు శ్రీకాంత్, పెద్దాపురం సిఐ యువకుమార్, తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఎస్ఐ శ్రీనివాస్ నాయక్, తోటకూర సాయిరామకృష్ణ, దూది రాజు, కాపవరపు కుమార్, అందుగుల జార్జి చక్రవర్తి, కె.వీరభద్రరావు, అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us