విద్యతోనే బాలికల జీవితాల్లో వెలుగు

UPDATED 24th JANUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: బాలికలు చదువుకుంటేనే విజ్ఞానంతో పాటు జీవితంలో వెలుగులు నిండుతాయని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ  పేర్కొన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గురువారం సుమారు రెండు వందల మంది విద్యార్థినులతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరామకృష్ణ మాట్లాడుతూ బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, రైతులు తదితర అంశాల అమలు లక్ష్యంగా 2008 జనవరి 24వ తేదీన మొదటిసారిగా జాతీయ బాలిక దినోత్సవాన్ని జరిపారని, నాటి నుంచి ప్రతీ సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, కె. అరుణ, డివిఆర్ఎన్ వల్లి, కె. శ్రీనివాస్, శ్రీవల్లి, కెవివి సత్యనారాయణ, చంద్రమోహన్, కృష్ణవేణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us