చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటిపల్లి ఆశ కార్యకర్త చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఐటీడీఏ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వెదుళ్ళ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని లచ్చిరెడ్డి సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్యం కాపాడే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ, చెల్లాయమ్మ గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us