పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన "ప్లాంటేషన్ డే" కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా కళాశాల ఇకో క్లబ్ సభ్యులు “ప్లాంటేషన్ డే" నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. ప్రకృతి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ ప్రపంచంలో ప్రతి పౌరుని యొక్క ప్రధాన విధి అని, తద్వారా స్థిరాభివృద్ధి సాధించి భవిష్యత్తు తరాలను కాపాడుకోగలమన్నారు. జీవితంలో ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసే విధంగా ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తమ విధిగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ఎంవీ హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరక్టర్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేష్, విభాగాధిపతులు, కళాశాల ఇకో క్లబ్ కో-ఆర్డినేటర్ ఎన్. భార్గవి విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us