సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు అధికారులు పట్టించుకోవడంలేదని, గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దీక్ష చేస్తున్న ఆశా వర్కర్లను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు నెల రోజులుగా పీ.హెచ్.సి పరిధిలో గల 32 మంది ఆశ వర్కర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే కనీసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని, అసలు డివిజన్ లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారా లేరా అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లకు ప్రజాప్రతినిధులు అండగా ఉండకపోగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటామని ప్రజా ప్రతినిధులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య పరిష్కరించలేని ప్రజా ప్రతినిధులు దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకులు మార్తమ్మ, మంగమ్మ, చంద్రకళ, వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us