UPDATED 19th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్థానిక పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాలాత్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. అనంతరం ఆలయ నంది మండపంలో ఆయనకు వేదపండితులు వేదస్వస్థి నిర్వహించి ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, మేకా శ్రీనివాసు, మూసిరెడ్డి వెంకటేశ్వరరావు, రెడ్డి లక్ష్మీ, కరణం భాను, గోకేడ రాజా, తదితరులు పాల్గొన్నారు.







