అభివృద్ధిని చూసి టిడిపికి ఓటెయ్యండి

UPDATED 24th MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట పట్టణంలో కౌన్సిలర్  బడుగు శ్రీకాంత్ ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని హోంమంత్రి చినరాజప్ప, కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం స్థానిక మెహర్ కాంప్లెక్స్ సమీపంలో గల పెంకుల మిల్లు ఆవరణలో అయోధ్యుల రాజేష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో  యువత పార్టీలో చేరారు. అనంతరం పట్టణ పరిధిలోని పాత్రుల వీధిలో 10,11 వార్డుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప, సునీల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, వర్గ విభేదాలు లేకుండా ఐకమత్యంతో కష్టపడి పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి నీతి, నిజాయతీ రెండు కళ్లు అని, పేదవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సుపరిపాలన అందించే చంద్రబాబును ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే టిడిపి లక్ష్యమని, డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ నిధులు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, కురుకూరి సోమేశ్వరరావు, పసల సత్యానందరావు, పసల పద్మ రాఘవరావు, వైణ్ణి శ్రీనివాస్, తోట సుబ్బారావు నాయుడు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us