మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎంకు అత్యున్నత గౌరవం

UPDATED 26th JULY 2018 THURSDAY 11:30 AM

సామర్లకోట: గత నాలుగేళ్లలో జాతీయస్థాయి అవార్డులు అందుకొన్న అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విందు ఇచ్చారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి శాలువ కప్పి మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ కూడా ఒకరు కావడం విశేషం. ఈ సందర్భంగా సాయిరామకృష్ణ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులతో పాటు విద్యాశాఖ తరపున వ్యక్తిగత విభాగంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా సన్మానించబడడం ఒక మధురానుభూతి కలిగించిందని అన్నారు. 34 సంవత్సరాల క్రితం ఇదేరోజున ఉపాధ్యాయుడిగా విధులు చేపట్టానని, నేడు 35వ సంవత్సరంలో అడుగు పెట్టడం మరో విశేషమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి అభినందించి వారితో కలిసి విందులో పాల్గొన్నారు.     
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us