ఏసు సేవలో ఎంతో గొప్ప శక్తి ఉంది

*అంతర్జాతీయ వర్తమానికురాలు యోజానారెడ్డి
* ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో యూత్ రిట్రీట్ వేడుకలు

UPDATED 2nd OCTOBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: ఏసుక్రీస్తు సేవలో ఎంతో గొప్ప శక్తి ఉందని ప్రముఖ అంతర్జాతీయ వర్తమానికురాలు యోజనారెడ్డి కొంకి అన్నారు. పట్టణంలోని ఆంధ్రా బాపిస్టు చర్చిలో అంతర్జాతీయ వర్తమానికులు ఈలి సువార్తరాజు అధ్యక్షతన చర్చి యూత్ ఆధ్వర్యంలో మెగా యూత్ రిట్రీట్ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యోజానారెడ్డి మాట్లాడుతూ జీవితంలో మానవుల కష్ట నష్టాలు, బాధలు తీర్చేందుకు దేవుడు మనకోసం అవతరించారని అన్నారు. అనంతరం చర్చి ఆధ్వర్యంలో వివిధ సువార్త కార్యక్రమాలు, దేవుని విశిష్టత గురించి ప్రసంగించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారికి బైబిలు గ్రంథంలోని వివిధ అంశాలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.  అనంతరం యువజనులు అద్భుతమైన సంగీతాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us