* శివనామ మార్మోగిన ఆలయాలు
* వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
UPDATED 21st FEBRUARY 2020 FRIDAY 11:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): హరహర మహాదేవ శంభో శంకర...అంటూ భక్త్తుల శివనామ స్మరణలతో సామర్లకోట పట్టణ, మండల పరిధిలో గల శైవ క్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. అర్థరాత్రి నుంచే అధిక సంఖ్యలో భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజలు, మహానివేదన పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, పడాల వీరబాబు, అడబాల కుమారస్వామి, పాలకుర్తి శ్రీనుబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ళ లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, మట్టపల్లి రమేష్, మద్దాల శ్రీను, గోకాడ రాజా, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సామర్లకోట ఎస్ఐ సుమంత్, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం భీమేశ్వర సంఘం, భీమేశ్వర లయన్స్ క్లబ్, ఉప్పు కోదండ రామయ్య ట్రస్ట్, ఉప్పు వారి సత్రం, సర్వేజనా సుఖినోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ, మాదిగ మహాజన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేశారు. సర్వేజనా సుఖినోభవంతు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్, మాదిగ మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు కాపవరపు కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సారధి, కందుకూరి వెంకటరమణ, దన్నిన నవీన్, నిమ్మిడితల్లి కంటిపాముల పండు, విప్పర్తి రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత పాలు, మజ్జిగ, రొట్టెలు అందించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సంఘం ప్రెసిడెంట్ దేవు లక్ష్మీకాంత్, శ్రీకాంత్, సెక్రెటరీ యండమూరి సత్యనారాయణ, కోశాధికారి లంకలపల్లి వెంకట సత్య రమేష్, సభ్యులు గోవిందపూడి సుబ్రహ్మణ్యం, కొచ్చెర్ల సన్యాసిరావు, గానుగుల శ్రీనివాస్, గొల్లవిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు..







