విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

UPDATED 28th FEBRUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే సమాజ అభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలను అందించగలుగుతారని మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య అన్నారు. స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు  వందకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. హృదయం, మెదడు, కిడ్నీ, మైటోకాండ్రియా, నాడీకణం, కణ విభజన, అస్తిపంజరం, అర్బిటా తదితర ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సిహెచ్.వి.వి సత్యన్నారాయణమూర్తి, మున్సిపల్ మేనేజర్ అచ్యుతరాజు, యుఎల్ బి కోఆర్డినేటర్ కెఎస్ శేఖరం, ఉపాధ్యాయులు ఎమ్.ఎస్.డి. భవానీదేవి, ఎం. సూర్యావతి, బి. విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us