ఆదిత్యలో ప్రారంభమైన శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో కొలువైయున్న  సరస్వతీదేవి ఆలయంలో ఈనెల పదవ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగు శ్రీ దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు, కర్రి వెంకటకృష్ణారెడ్డి, సరోజినీదేవి దంపతులు అమ్మవారి విగ్రహం, కలశస్థాపన మహోత్సవం, అఖండ దీపారాధన, యాగ సంకల్పం కార్యక్రమాలు ఘనంగా  నిర్వహించారు. అలాగే ప్రతీరోజు ఉదయం ఏకవార రుద్రాభిషేకాలు, సాయంత్రం కుంకుమార్చనలు, నీరాజన మంత్రపుష్పం, నవదుర్గా అలంకారాలతో ఆయా రోజులలో ప్రత్యేకంగా విశేష పూజలు జరుగుతాయని, ఈ నెల 21వ తేదీన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని సతీష్ రెడ్డి తెలిపారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us