అండగా ఉంటాను...ఆదరించండి

* నూతన రాజకీయ ప్రత్యామ్నాయంతోనే అభివృద్ధి
* జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర

UPDATED 2nd APRIL 2019 TUESDAY 6:00 PM

సామర్లకోట: తనను ఆదరించి ఓటేసి గెలిపిస్తే జీవితాంతం ప్రజలందరికీ అండగా ఉంటానని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సామర్లకోట పట్టణంలో పలు వార్డుల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ గుర్తు గాజులుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నూతన రాజకీయ ప్రత్యామ్నాయంతోనే అభివృద్ధి చెందుతుందని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే  నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తానని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని, జై భారత్ నేషనల్ పార్టీ ద్వారానే ప్రజా సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయని అన్నారు. పెద్దాపురం నియోజక వర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని డాక్టర్ చిన్నయ్య దొర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.       

  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us