మహోన్నత వ్యక్తి అంబేద్కర్

* ఘనంగా అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు
* నివాళులర్పించిన పలువురు నాయకులు

UPDATED 6th DECEMBER 2019 FRIDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : భారతదేశంలోని దళితులు, అణగారిన వర్గాలు, మహిళలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి, ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 63వ వర్ధంతి వేడుకలను సామర్లకోట పట్టణ, మండల పరిధిలో గల గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంతో పాటు వివిధ వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దొరబాబు ముఖ్య అతిధిగా హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ మహానేత, ప్రపంచ మేధావి డాక్టర్‌ అంబేద్కర్‌ అన్ని వర్గాల సంక్షేమం, ప్రజలు సుఖంగా, హక్కులు పొందే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. తరతరాలుగా అణగారిన కులాలకు, వర్గాలకు ధైర్యాన్ని నింపి తమ హక్కులను తెలియజేసేలా మార్గదర్శకాలు రూపొందించిన వ్యక్తి అంబేద్కర్‌ అని పేర్కొన్నారు. ప్రజలు అంబేద్కర్‌ అడుగు జాడల్లో నడుచుకుని ఆయన ఆలోచనలనకు అనుగుణంగా ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, వైఎస్ఆర్ సిపి నాయకులు సేపేని సురేష్, మద్దాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, కాళ్ల లక్ష్మీనారాయణ, నేతల హరిబాబు, పాగా సురేష్ కుమార్, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, డిఇ రామారావు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us