ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ బి+ గుర్తింపు

UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 8:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ బి+ గుర్తింపు లభించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గత నెలలో కళాశాలలో గల ల్యాబ్, లైబ్రరీ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరీక్షించి త్రిసభ్య బృందం సిఫారసు మేరకు తమ కళాశాలకు ఈ గుర్తింపు లభించినట్లు తెలిపారు. భారతదేశంలోని విద్యాసంస్థలు, యూనివర్సిటీల క్వాలిటీ స్టేటస్, కరిక్యులం, టీచింగ్, లెర్నింగ్, ప్రాసెస్, ఫ్యాకల్టీ రీసెర్చ్, కళాశాల మౌలిక సదుపాయాలు, ఆర్ధిక వనరులు తదితర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో ప్రమాణాలుగా తీసుకొని ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తమ కళాశాలకు బిప్లస్ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని అందుకు కృషిచేసిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us