UPDATED 9th AUGUST 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం: మహిళల రక్షణకు శక్తి టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్ద శక్తి టీమ్ సభ్యులకు శుక్రవారం స్కూటీలను ఆయన అందచేశారు. అనంతరం డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజీపీ గౌతమ్ సవాంగ్ మహిళల రక్షణ నిమిత్తం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశారని, దీనిలో భాగంగా పెద్దాపురం సబ్-డివిజన్ పరిధిలోని పెద్దాపురం, జగ్గంపేట పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు జె. దేవకుమారి, జి. రూపలకు ఈ మేరకు రెండు స్కూటీలను అందచేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా వారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సంబంధిత పోలీసు స్టేషన్ల పరిధిలో గల పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండులు, అలాగే మహిళలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో తిరుగుచూ మహిళలు ర్యాగింగ్, వేధింపులకు గురి కాకుండా కాపాడుతూ పెట్రోలింగ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వి. సురేష్, తదితరులు పాల్గొన్నారు.







