ప్రభుత్వ పథకాలపై మహిళా సంఘాల ప్రతినిధులు అవగాహన పెంపొందించుకోవాలి

UPDATED 15th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: ప్రభుత్వ పథకాలపై మహిళా సంఘాల ప్రతినిధులు అవగాహన పెంపొందించుకోవాలని విస్తరణ శిక్షణా  కేంద్రం ప్రిన్సిపాల్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా  కేంద్రంలో జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వాటి ప్రయోజనాల గురించి మిగిలిన సభ్యులకు తెలియజేయాలన్నారు. మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆయా గ్రామాలకు వెళ్లి శిక్షణలో నేర్చుకున్న విషయాలను తెలియజేసి, ప్రతి గ్రామంలో వర్మి కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు వెంకట్రావు, గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us