అగ్ని బాధితులకు సాయం అందజేత

గంగవరం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో బుధవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాద బాధితులను ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పరామర్శించారు. అగ్ని బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రభుత్వం నుంచి రావలసిన సాయాన్ని అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గంగాదేవి, కనక లక్ష్మి, వైసీపీ నాయకులు అప్పలరాజు, చక్రి తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us