విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు పోలీవేద చక్కటి వేదిక

* ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి
* ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్ పోలీ వేద-2కె18

UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్ పోలీ వేద-2కె18 ఘనంగా ప్రారంభమయ్యింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం నిర్వహించిన సభలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలకు ఈ పోలీవేద చక్కటి వేదికగా నిలుస్తుందని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన పరిజ్ఞానాన్ని అందించడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, అందుకే గత విద్యా సంవత్సరంలో 92 శాతం మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఎజిఎం కె. శంకరరావు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తనలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలంటే ఇటువంటి టెక్ ఫెస్ట్ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. మరో ముఖ్య అతిధి రాక్ సిరామిక్స్ ఎజిఎం షేక్ కరీముల్లా మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం కావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవాలని, అందుకు వేద వంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని, వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థుల తమ తమ భావాలను పంచుకొనే అవకాశం దొరుకుతుందని అన్నారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం ముఖ్య అతిధులను దుశ్శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మాధవరావు, వివిధ శాఖాధిపతులు, వివిధ కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us