UPDATED 4th FEBRUARY 2019 MONDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ కు చెందిన బిబిఏ, ఎంబిఏ, పిజిడిఎం విద్యార్థులు రాయవరం మండలం చెల్లూరులో గల సర్వారాయ షుగర్స్ కర్మాగారాన్ని సందర్శించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో భాగంగా పరిశ్రమలు సందర్శన ఒక అంశంగా ఉందని, దానికి అనుగుణంగా తమ సంస్థ విద్యార్థులకు పరిశ్రమలను సందర్శించే అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులు పరిశ్రమలను సందర్శించడం వల్ల అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమలను సందర్శించడం వల్ల వ్యాపార రంగాలకు అవసరమయ్యే జ్ఞానం, అక్కడ జరిగే ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అనేక విషయాలను ఆయా పరిశ్రమలకు చెందిన అధికార ప్రతినిధుల ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్శనలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మెహర్జీ దువ్వూరి, ఎం. గోవర్ధనరెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







