విద్యా ప్రమాణాల స్థాయి పెరగాలి:ఎంఈవో మల్లేశ్వరరావు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: పాఠశాల్లో విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలని మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని ఏటిపల్లిల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రభాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us